త్వరలో ఐపీఎల్ సందడి ప్రారంభం కాబోతుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ పీవర్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం.. బీసీసీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ వేదికల్లో పొగాకు, మద్యం ప్రకటనలు, అమ్మకాలకు సంబంధించిన ప్రకటనలు నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది.