పాన్ కార్డ్ దరఖాస్తు కోసం కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ తమిళంలో కూడా అందుబాటులో ఉండాలని నటుడు విజయ్ సేతుపతి అభ్యర్థించారు. మదురైలోని తముక్కం మైదాన్‌లో ఆదాయపు పన్ను శాఖ 3 రోజుల పాటు పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరానికి ప్రత్యేక అతిథిగా హాజరైన నటుడు విజయ్ సేతుపతి.. ఆదాయపు పన్నుకు సంబంధించిన వెబ్‌సైట్లు తమిళంలో ఉండాలని అన్నారు. “నేను నా చదువును పూర్తి చేసి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిటర్‌తో పనిచేశా.…