ఎయిమ్స్ ఉన్నతాధికారులకు తలంటేశారు కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్. మంగళగిరి ఎయిమ్స్ ని ఆమె సందర్శించారు. ఓపీ మొదలుకుని ఆస్పత్రిలో అందుతోన్న ప్రతి ఒక్క సేవ పైనా ఎయిమ్స్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పవార్. దీంతో నీళ్లు నమిలారు ఎయిమ్స్ అధికారులు. ఆస్పత్రికి నీటి సమస్య ఉందని.. టెండర్లు రావడం లేదన్నారు అధికారులు. ఇంత పెద్ద భవనాలు కట్టడానికి టెండర్లు వచ్చినప్పుడు.. నీటి సరఫరా కోసం టెండర్లు ఎందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.…