ఇన్నాళ్లు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా ఇండియాలో తొలిసారిగా మంకీపాక్స్ కేసు నమోదు అయింది. కేరళ తిరువనంతపురానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఇటీవల యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చాడు. అయితే అతనికి మంకీపాక్స్ సంబంధిత లక్షణాలు ఉండటంతో శాంపిళ్లను పూణెలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించగా.. మంకీపాక్స్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. తాజాగా మంకీపాక్స్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ…