తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే పెట్రోల్ డీలర్స్ మాత్రం మండిపడుతున్నారు. ఒక్కసారిగా తగ్గించిన పెట్రోల్ ధరలతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చిందంటున్నారు. డీలర్ కమిషన్ లో సైతం న్యాయం లేదంటూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన 16 రాష్ట్రాలో నో పర్చేస్ డే ప్రకటించారు. మొన్నటి వరకు భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో నానా తిప్పలు పడ్డారు వాహనదారులు, పెట్రోల్ డీలర్స్.…