Centenary Celebrations Of Ghantasala: సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల అని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం కొనియాడారు. వాషింగ్టన్ డీసీలో సంక్రాంతి సంబరాలు, ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అలనాటి నటి, మీర్జాపురం రాజా సతీమణి శ్రీమతి కృష్ణవేణికి తను రాసిన ‘ఆటగదరా శివ’ పుస్తకాన్ని అందజేశారు నటుడు తనికెళ్ళ భరణి. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారు ఘటసాల శతజయంతి స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని కృష్ణవేణికి అందజేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భరణి. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్రసీమలో కృష్ణవేణి పాత్ర మరచిపోలేననిదని చెప్పారాయన. అంతే కాదు తను రాసిన ‘ఆటగదరా శివ’లోని పద్యాలను పాడి వినిపించారు.
ఘంటసాల శతజయంతి అంతర్జాతీయ ఉత్సవాలలో భాగంగా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారు ఆదివారం ఉదయం అలనాటి నటి కృష్ణవేణిని ఘనంగా సన్మానించారు. అంతే కాదు ఘంటసాల శతజయంతి స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి నిర్మించిన ‘మనదేశం’, ‘కీలుగుర్రం’ చిత్రాలలో కృష్ణవేణి పాడిన పాటలను పాడి వినిపించటం విశేషం. ఈ కార్యక్రమంలో నటుడు, రచయిత తణికెళ్ల భరణి కూడా పాల్గొన్నారు.