పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గొప్ప మనసు గురించి టాలీవుడ్‌లో కథలు కథలుగా చెప్పుకుంటారు. తాజాగా ‘ది రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ రిద్ధి కుమార్ చేసిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఈవెంట్‌కు ఆమె కట్టుకొచ్చిన తెల్లటి చీరను ప్రభాస్ స్వయంగా గిఫ్ట్‌గా ఇచ్చారని, దానిని మూడేళ్లుగా దాచుకుని ఇప్పుడు కట్టుకున్నానని చెప్ప డంతో వీరిద్దరి మధ్య ఏదో ‘రిలేషన్’ ఉందంటూ రూమర్స్ షురూ అయ్యాయి. ఈ వార్తలపై…