మలయాళ స్టార్ సురేష్ గోపి ఆదివారం మేడే సందర్భంగా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మా) సమావేశానికి హాజరయ్యారు. సంస్థతో తనకు రెండు దశాబ్దాలుగా ఉన్న ఎడబాటుకు ముగింపు పలికారు. నటుడు, రాజకీయవేత్త అయిన సురేశ్ గోపికి అసోసియేషన్ నుంచి ఘన స్వాగతం లభించింది. అమ్మా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఉనర్వుకు సురేశ్ గోపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యదర్శి ఎడవెల బాబు సహా అమ్మా ఆఫీస్ బేరర్స్, నటుడు బాబురాజ్ సురేష్ గోపికి శాలువా…