ఓటుకు నోటు అనేది ఒకటి ఇవ్వడం.. మరొకటి తీసుకోవడం అని ఎలక్షన్ కమిషనర్ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటుకు నగదు పంపిణీ ఎక్కువ సంఖ్యలో అనేది మా దృష్టికి వచ్చింది.. రాబోయే ఎన్నికల్లో పటిష్టమైన నిఘా పెడుతున్నామని ఆయన చెప్పారు.
Vote From Home: ఇకపై కొన్ని వర్గాల ప్రజలు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించబోతోంది భారత ఎన్నికల సంఘం. 80 ఏళ్లకు పైబడిని వారు ఇకపై ఇంటి నుంచే ఓటేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లో తీసుకురాబోతున్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 80 ఏళ్లకు పైబడిన వారు, వికలాంగులకు ఇంటి నుంచే ఓటేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది.…
గుజరాత్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. దేశంలోని అత్యున్నత పోల్ బాడీలో మూడో పోస్టు దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది.
ఇవాళ కన్నుమూసిన స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగీ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో గల కల్పానికి బయలుదేరారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ఫిబ్రవరి 18,2023తో ముగుస్తోంది. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ తిరుగలేని అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను అధికారంలో ఉన్నానని చెబుతోంది.
Himachal pradesh Election schedule: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. ఒకే దశలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుపుతామని.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.