కర్ణాటక బీజేపీ మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. గతేడాది మాజీ మంత్రి రాసలీలల సీడీ లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని, రాసలీలల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో తమ కుటుంబం పరువు పోయిందని, తనకు ప్రాణహాని ఉందని యువతి మాజీ మంత్రి మీద బెంగళూరులో కేసుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు విచారించిన స్పెషల్…