సీబీఐ దాడుల విషయాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధ్రువీకరించారు. తన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
CBI: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. ఎక్సైజ్ పాలసీ వివాదంపై ఆయన నివాసంపై సీబీఐ దాడులు చేసింది. దేశ రాజధానిలోని 20 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, మనీష్ సిసోడియా తన ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ, విచారణకు సహకరిస్తానని ట్వీట్ చేశారు. సిసోడియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పరిణామాన్ని ధృవీకరించారు. “సీబీఐ వచ్చింది. వారిని స్వాగతిస్తున్నాం. మేము చాలా…