కేంద్రం పంజరంలో చిలుకగా పేరు మోసిన సిబిఐ డైరెక్టర్ ఎంపిక భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ జోక్యంతో కొత్త మలుపు తిరగడం కీలక పరిణామం. సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు,సిజెఐ సభ్యులుగా వుంటారు. కేంద్ర క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది గనక ఈ కమిటీ చర్చలు లాంఛనంగానే పరిగణించబడేవి. ఈసారి బిఎస్‌ఎప్ డైరెక్టర్‌గా వున్న రాకేశ్ ఆస్తానా, ఎన్‌ఐఎ బాస్ వైసిమోడీ పేర్లు తుది జాబితా నుంచి ఎగిరిపోయాయి. రాకేశ్ ఆస్తానాను ప్రధాని…