ఆయేషా మీరా తల్లి సీజేఐ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. 14 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేదని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు మధ్యలోనే ఎందుకు ఆపివేసారో తెలియడం లేదన్నారు. నేరస్థులు ఎవరో తెలిసినా దర్యాప్తు సంస్ధలు పట్టుకోలేని స్ధితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలో న్యాయం జరగదని మీరు ఆమోదముద్ర వేస్తే మూగజీవాలుగా మిగిలిపోతామని లేఖలో అయేషా మీరా తల్లి పేర్కొన్నారు. ఇదిలా వుండగా… సీజేఐ జస్టిస్ ఎన్వీ…
ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై సీబీఐ కేసులు నమోదుచేసింది. నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ డైరెక్టర్లు సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డి పై కేసు నమోదయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసింది సీబీఐ, తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని బీఓబీ ఫిర్యాదు చేసింది. ఎస్పీవై రెడ్డి సహా పలువురు మోసం చేశారని సీబీఐకి ఫిర్యాదు చేసింది. రూ.61.86 కోట్ల నష్టం…
దక్షిణ మధ్య రైల్వే ఇంజినీరు, కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసింది సీబీఐ.. కాంట్రాక్టర్ల నుంచి ఈఈ రూ.1.29కోట్ల లంచం తీసుకున్నట్లు అభియోగాలు మోపింది.. దక్షిణ మధ్య రైల్వే బెంగళూరు ఈఈ ఘన్ శ్యాం ప్రధాన్‌తో పాటు.. గుత్తేదార్లు ఎం.సూర్యనారాయణరెడ్డి, వంగల సూర్యనారాయణరెడ్డిపై కేసులు నమోదు చేసింది సీబీఐ.. ఇక, ఇవాళ దేశవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు చేపట్టారు సీబీఐ అధికారులు.. నంద్యాల, రంగారెడ్డి జిల్లా, బెంగళూరు, హుబ్లీ, సంగ్లీ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించాయి…
గుంటూరు సిటీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై కేసు నమోదు చేసింది సీబీఐ… పొగాకు కొనుగోలు కంపెనీ పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి రూ.45 కోట్ల రుణాలు తీసుకున్న వెంకట్రావు.. రూ.19 కోట్ల రుణాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు అభియోగాలున్నాయి… బ్యాంకు ఫిర్యాదుతో తాడిశెట్టి వెంకట్రావు, మురళీమోహన్‌పై కేసు నమోదు చేసింది సీబీఐ.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో వెంకట్రావు ఆస్తులపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.. కాగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో..…