రైతు ఏ కారణం చేత మరణించినా 10 రోజులలో రూ.5 లక్షల పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రంలో ప్రభుత్వ ఉచిత చేపల పంపిణీలో భాగంగా రొయ్యలు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు.