CM Revanth Reddy : రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కుల గణన పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రులు…
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు- నష్టపోతున్న లక్షలాది మంది తెలంగాణ లబ్దిదారులు అంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో మీ ప్రభుత్వం కోతలు పెడుతూ, పేద ప్రజలను మోసం చేయాలని చూడటం దుర్మార్గమని, అభయహస్తం మేనిఫెస్టోలో అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు…
Rahul Gandhi: బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అభివృద్ధి పనులు చేయడానికి కులగణన అనేది చాలా అవసరమని అన్నారు. శనివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని అన్నారు.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో ఐలాపూర్ షడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయితీకి చెందిన పలువురు ప్రజలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా.. తమ గ్రామానికి ఇంత వరకు తారు రోడ్డు నిర్మించక పోవడం దారుణమన్నారు.
కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు ఓటు వేస్తేనే నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని అయ్యారన్నారు. బీసీలలో చీలిక తీసుక రావడానికి రాహుల్ గాంధీ పన్నిన కుట్ర ఇది అని, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలో ఏది వెనక్కి తీసుకోవాలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు ఆనంద్ గౌడ్.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో స్వాగతం పలికిన జిల్లా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు కామారెడ్డి సభలో బి సి డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయిందని, బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి ఒక్కటైనా హామీ చేసిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.
నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయని తెలిపారు. కలెక్టర్లు ఎనుమరెటర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలు ఏంటో వెను వెంటనే తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల…
Half Day Schools: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు బుధవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే నడుస్తాయి.
కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టైటానిక్ పడవ ను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారన్నారు.