తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఈడీ ముందు చికోటి ప్రవీణ్ హాజరైన విషయం తెలిసిందే. నాలుగో రోజు చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ ముగియగా.. ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. విచారణ జరుగుతోందని ఈడీ అడిగిన ప్రశ్నిలన్నింటికీ సమాధానం చెప్పానని ఆయన వెల్లడించారు.
చికోటి ప్రవీణ్ ని గంటలు తరబడి ఈడీ విచారిస్తుంది .మొదటి రోజు 14 గంటల పాటు విచారించిన ఈడీ.. రెండో రోజు 11 గంటల పాటు విచారించింది. ఇప్పటివరకు 25 గంటల పాటు ఈడీ చికోటి ప్రవీణ్ ను విచారించింది. చికోటి ఆర్థిక లావాదేవులపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా విదేశాల్లో క్యాసినో ఆడితే అక్కడి డబ్బుని ఇక్కడికి తీసుకొచ్చారా, లేదంటే కాయిన్స్ అక్కడ ఇచ్చి ఇక్కడ డబ్బులు వసూలు చేసుకున్నారా అనే విషయం మీద ప్రధానంగా…