ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2022 సీజన్‌లో దుమ్మురేపాడు. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అతడు 863 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 57.53గా నమోదైంది. బట్లర్ ఒకవైపు పరుగుల వర్షంతో పాటు అవార్డుల వర్షాన్ని కూడా కురిపించాడు. ఈ సీజన్‌లో బట్లర్ ఏకంగా 37 అవార్డులు అందుకున్నాడు. ఈ అవార్డుల ద్వారా రూ.98 లక్షల…