తెలుగు పత్రికా రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు తన బొమ్మలతో ఊపేసిన ప్రముఖ చిత్రకారులు బాలి సోమవారం అర్థరాత్రి అనారోగ్యంతో విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. 1942 సెప్టెంబర్ 29న అనకాపల్లిలో అన్నపూర్ణ, లక్ష్మణరావు దంపతులకు జన్మించిన బాలి విద్యాబ్యాసం అంతా అక్కడే జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో చేరారు. కానీ చిత్రలేఖనం పట్ల ఉన్న మక్కువతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1974లో ఈనాడు…