High Blood Pressure: ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు(హై బీపీ) చాలా మందికి ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి మందులు సహాయపడుతుంటాయి.
ఆధునిక కాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యయనాల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా గుండెపోటు సమస్య వస్తుందని తేలింది. ఎందుకు పురుషుల్లో ఎక్కువగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్‌లు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో రుతుచక్రం కొనసాగేటప్పుడు రక్తంలో ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
ఇప్పటివరకు అనేక అధ్యయనాలలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ గుండెపోటు ప్రమాదాలకు గురవుతారని కనుగొన్నారు. అయితే.. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) అనుభవించిన స్త్రీలు గుండె సంబంధిత వ్యాధులు పట్ల తక్కువగా ప్రభావితం అవుతారని వెల్లడైంది. వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని.. దీని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం తెలిపింది.
వ్యాయామం అనే ఆరోగ్యాన్ని, శారీరక ధృడత్వాన్ని ప్రోత్సహించడానికి, మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గుండెకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మానసిక స్థితి మెరుగుపడడంతో పాటు బరువు పెరగకుండా కాపాడుతుంది. వ్యాయామం కండరాలు, ఎముకల బలాన్ని పెంచుతుంది.