Corona: మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వదిలిపోయిందనుకున్న ప్రతీసారి మరల తిరగబడుతూ ప్రజలకు కునుకు లేకుండా చేస్తుంది. ఇది చేసిన గాయాలను ప్రపంచమే కొన్ని తరాలకు గుర్తుంచుకునేలా చేసింది. తాజాగా కేసులు తగ్గుతూ ఉన్నాయి. ఇటీవల ఫ్లోరిడాకు చెందిన సర్జన్ జనరల్ డాక్టర్ జోసెఫ్ లాడపో వెల్లడించిన విషయాలు వింటే షాక్ కు గురవ్వాల్సి వస్తోంది.
Read Also: Vishaka Garjana: మూడురాజధానులు కావాల్సిందే… గళమెత్తిన జనం
ప్రస్తుతం కరోనా నివారణకు ఇస్తున్న ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారిత టీకాలతో గుండె సమస్యలు ఏర్పడి మరణాల రిస్క్ పెరిగిపోతున్నట్టు ఫ్లోరిడాకు చెందిన సర్జన్ జనరల్ డాక్టర్ జోసెఫ్ లాడపో తెలిపారు. ముఖ్యంగా 18నుంచి 39 సంవత్సరాల్లోపు వారికి రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్టు చెప్పారు. కనుక గుండె జబ్బులున్నవారు ఎంఆర్ఎన్ఏ ఆధారత టీకా తీసుకునే ముందు వైద్యుల సూచన తీసుకోవాలని సూచించారు. ‘‘కోవిడ్-19 ఎంఆర్ఎన్ఏ టీకాలకు సంబంధించి విశ్లేషణను విడుదల చేశాం. వాటిపట్ల అవగాహన ఉండాలి. ఈ అధ్యయనంలో భాగంగానే 18-39 ఏళ్ల వారికి అధిక రిస్క్ ఉంటున్నట్టు వెల్లడైంది. ఎంఆర్ఎన్ఏ టీకా తీసుకున్న 28 రోజుల్లోపు గుండె సంబంధిత మరణం చోటు చేసుకుంటోంది’’ అని వివరించారు.
Read Also:K. Laxman: మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి.. కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య పోరు
ముఖ్యంగా అప్పటికే గుండె జబ్బులు ఉన్న వారికి ఈ టీకా ప్రాణాంతకమవుతోంది. మయోకార్డైటిస్, పెరికార్డైటిస్ కు దారితీస్తోంది. మన దేశంలో ఎంఆర్ఎన్ఏ తాలూకూ తొలి వ్యాక్సిన్ జెమ్ కోవాక్-19 త్వరలోనే అందుబాటులోకి రానుంది. కోవిషీల్డ్ వైరల్ వెక్టార్ ఆధారితం. కోవాగ్జిన్ అన్నది ఇన్ యాక్టివేటెడ్ వైరల్ వ్యాక్సిన్.