Kerala: గూగుల్ మ్యాప్స్, జీపీఎస్‌ని నమ్మిపోతే ఇద్దరు యువ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. కారు నదిలో మునిగిపోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాంకు చెందిన డాక్టర్ అద్వైత్(29), త్రిసూర్‌కి చెందిన డాక్టర్ అజ్మల్(29) జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో విధులు ముగించుకుని కొడుంగల్లూరు నుంచి ఇళ్లకు బయలుదేరారు. వీరితో పాటు మరో ముగ్గరు డాక్టర్లు తబ్సిర్, తమన్నా, నర్స్ జిస్మాన్ కూడా ఉన్నారు.
శుక్రవారం చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం సియుల్ నదిలో పడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది.