China: చైనాలో దారుణ ఘటన జరిగింది. అమాయమైన ప్రజలపైకి కారుని పోనిచ్చి 35 మంది ప్రాణాలు తీశాడు. దక్షిణ చైనాలోని జూహై నగరంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందగా, 43 మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు మంగళవారం తెలిపారు.