ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియాకు ఐసీసీ భారీ షాకిచ్చింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందని ఆరోపిస్తూ ఐసీసీ భారీగా ఫైన్ విధించింది. రాహుల్ సేన నిర్ణీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియాకు ఐసీసీ 40 శాతం జరిమానా విధించింది. దీంతో భారత ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడనుంది. ఐసీసీ నియామవాళిలోని…