ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగానే మరణిస్తున్నారు. అవగాహన లోపం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో క్యాన్సర్ కేసులు ముదిరిన దశలో నమోదవుతున్నాయి. అయితే పరిస్థితిని సకాలంలో గుర్తించడం, వైద్యుల సలహాతో, ఈ వ్యాధికి చికిత్స చేయవచ్చు.
క్యాన్సర్ అంటే ఏమిటి? సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను 'కణితి'( ట్యూమర్) అని పిలుస్తారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా,…