ఆ మహిళకు ఏం ఆపద, కష్టమొచ్చిందో.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెజవాడలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి దగ్గర వండౌడ్ కాల్వలో ఇద్దరు పిల్లలతో సహా కాల్వలోకి దూకింది మహిళ. ఈ క్రమంలో.. అక్కడున్న స్థానికులు గమనించి ఏడాదిన్నర వయసున్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే.. ఆ చిన్నారిని హాస్పటల్‌కు తరలించే లోపే…
జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బస్సు కాలువలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పలువురు జవాన్లకు గాయాలయ్యాయి.
జూలై 13న అదృశ్యమైన పారిశుధ్య కార్మికుడి మృతదేహం కేరళ రాజధాని తిరువనంతపురంలోని కాలువలో సోమవారం ఉదయం లభ్యమైంది. శనివారం రోజున అమైజాంచన్ కాలువను శుభ్రం చేస్తుండగా పారిశుధ్య కార్మికుడు జాయ్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నావికాదళం, స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సోమవారం ఉదయం అతడి కోసం గాలింపు చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనం కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం.. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని షాంగ్లా జిల్లాలోని బర్బత్‌కోట్ ప్రాంతంలో సోమవారం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఐదుగురు మరణించినట్లు స్థానిక మీడియా సంస్థ సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్యూ సిబ్బంది.. మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.
Cruel Woman: అసోంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిల తన ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది. ఆపై వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో పెట్టి కాల్వలో పడేసింది.