తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అత్యవసర సమావేశం నిర్వహించి, పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ అమ్మీ రాజు, ట్రెజరర్ అలెక్స్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం వారు ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా గౌరవించే చిరంజీవి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. "నిర్మాతలు బాగుండాలి, మేము కూడా…