Today Business Headlines 19-04-23: ఆర్బీఐ లేటెస్ట్ గైడ్‌లైన్స్: రుణ బకాయిలపై విధించే జరిమానాల మీద వడ్డీ వసూలు చేయొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన అధీనంలోని బ్యాంకులను ఆదేశించింది. లోన్లు తీసుకున్నప్పుడు రీపేమెంట్‌కి సంబంధించిన రూల్స్ మాతృ భాషలో ఉండాలని సూచించింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదాను తాజాగా విడుదల
Post Offices: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్స్‌లోని పోస్టాఫీసుల్లో ఉన్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గత 19 ఏళ్లలో దాదాపు రూ.96 కోట్లను స్వహా చేశారు. 2002-2021 మధ్య కాలంలో ఈ అవకతవకలు జరిగాయి. ఈ సొమ్ములన్నీ సేవింగ్స్ ఖాతాల్లోని ప్రజాధనమే కావటం గమనార్హం.
ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. రూ. 48 వేల కోట్లు ఖర్చుకు లెక్కల్లేవంటూ నేను ఏడాది క్రితం చెప్పిన దాన్నే ఇప్పుడు కాగ్ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం లెక్కలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి కాగ్ భయపడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవాలి. రూ. 48 వేల కోట్లంటే.. 30 శాతం మేర బడ్జెట్టుకు లెక్కల్లేవని కాగ్ స్పష్టంగా చెప్పింది. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం లెక్కలు చూపకుండా ఖర్చు పెట్టేస్తే చూస్తూ…
ఏపీ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిందని కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులను ఖర్చు చేసి.. తర్వాత జూన్ 2020లో శాసన సభలో ప్రవేశ పెట్టారు.. ఇది రాజ్యాంగ విరుద్దం అన్నారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. చట్టసభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీన పరిచారు.…