తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై విస్తృత చర్చ జరుగుతోంది. వాళ్ళని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారని, లేందటే.. వాళ్ళు అంత తేలిగ్గా.. మంత్రి పదవి పేరుతో ముందుకు నడిచేవాళ్ళు కాదని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటించాలని కోరుకోవడంలో తప్పు లేదు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. తనను కేబినెట్ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారు. ఆయన్ని బతిమాలుతూ, బామాలుతూ,, సర్దిచెబుతున్నారు వైసీపీ నేతలు. సలహాదారు సజ్జల తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.