Supreme Court:కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. సీఏఏపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు 3 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సీఏఏని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 237 పిటిషన్లు దాఖలయ్యాయి.