IT Layoffs: ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఉద్యోగి కూడా తాజా లేఆఫ్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అంటే ఏ కంపెనీ అయిన కళ్లకద్దుకుని కొలువు ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూన్ రెండో విడత ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. దాదాపుగా 1000 మందిని కొలువుల నుంచి తీసిపారేసింది.