కరోనా సమయంలో విద్యార్థులకు ఎంతగానో సేవలందించిన భారత్‌లో అత్యంత విలువైన ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్. మహమ్మారి విజృంభించిన సమయంలో డిమాండ్ అధికంగా ఉండగా.. ప్రస్తుతం ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో బైజూస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.