అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్‌కు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జోస్ బట్లర్(97) చితక్కొట్టాడు. కానీ సెంచరీ చేయలేక పోయాడు.