Jobs Market-2023: ఇండియన్ జాబ్ మార్కెట్‌లో కొత్త సంవత్సరం నియామకాల జోరు నెలకొననుంది. ముఖ్యంగా స్పెషలైజ్డ్ ఐటీ, టెలికం అండ్ సేవల ఆధారిత రంగాలు ఈ రిక్రూట్‌మెంట్లలో జోష్ నింపనున్నాయి. రిటైల్, ఇ-కామర్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీల హైరింగ్‌లో పండుగ సీజన్ ఉత్సాహం ఈ ఏడాది మాదిరిగానే వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది. ఆతిథ్యం మరియు ఎయిర్‌లైన్ సెక్టార్లలో సైతం ఇదే ట్రెండ్ కంటిన్యూ కానుంది.