McDonald’s : అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ…
రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు.