Bus falls into river in Nepal: నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో వరసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం నేపాల్ లోని బారా జిల్లాలోని బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నేపాల్ లోని మాధేష్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. మరో 35 మంది గాయపడ్డారు. వీరిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.