బుర్రా మధుసూదన్. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే. మూడేళ్లుగా పెద్దగా సమస్యలు లేకుండా రోజులు గడిచిపోయినా.. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో రివర్స్ కొడుతోందట. ఇన్నాళ్లూ వైసీపీ ద్వితీయశ్రేణి నేతలతో సయోధ్య కుదుర్చుకుని సర్దుబాటు చేసుకున్నారు మధుసూదన్. ఇటీవలే కొత్తగా వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టారు. కానీ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమే ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నాయట. సమస్యలపై కొందరు.. ఇన్నాళ్లూ ఏమైపోయారు అని ఇంకొందరు ప్రశ్నలు సంధిస్తుంటే.. వారితో వైసీపీ కేడర్ కూడా…