పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ట్రాన్స్‌లేటర్‌గా మారాడు. సిరాజ్ హిందీలో మాట్లాడితే.. బుమ్రా ఆ వ్యాఖ్యలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విషయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా, సిరాజ్ కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్స్ తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6…