బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. పలు చోట్ల ముస్లింలు తమ నిరసనను తెలియజేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాళ్లు రువ్వడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాలను తగలబెట్టడం చేశారు. ముఖ్యంగా ఇటీవల యూపీ కాన్పూర్ లో రాళ్లదాడి చేయగా.. నిన్న ప్రయాగ్ రాజ్ లో కొంతమంది అల్లరి మూకలు రాళ్లదాడి చేశారు. దీంతో పాటు సహరాల్ పూర్ లో…