సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌లో ఒక భవనం కూలినట్లు చూడొచ్చు. బెంగళూరులోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో కొన్ని సెకన్ల వ్యవధిలో భవనం నేలమట్టమైంది. స్థానికుల కథనం ప్రకారం.. భవనంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా భవనంలో భారీ పగుళ్లు పడ్డాయి.