Today (27-01-23) Business Headlines: సీఈఓగా తప్పుకోనున్న టయోడా: జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అధ్యక్షుడు అకియో టయోడా ఈ పదవుల నుంచి తప్పుకోనున్నారు. ఇక మీదట ఆయన సంస్థ చైర్మన్’గా మాత్రమే కొనసాగనున్నారు. అకియో టయోడా స్థానంలో కోజి సాటో CEOగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ప్రస్తుతం టయోటా కంపెనీ చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్’గా చేస్తున్నారు.