ఈ సంవత్సరం ప్రవేశ పెట్టనున్న యూనియన్ బడ్జెట్ కోసం ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లతో బడ్జెట్ పన్ను మినహాయింపు దక్కుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రకటనలు వెలువడుతాయని భావిస్తున్నారు.
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11:00 గంటలకు లోక్ సభలో సమర్పించనున్నారు. మొత్తంగా ఇది ఆమె ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం అవుతుంది.