ప్రముఖ చిత్ర దర్శకుడు బుద్ధదేవ్ దాస్ గుప్తా (77) అనారోగ్యంతో జూన్ 10వ తేదీ కన్నుమూశారు. లెజండరీ ఫిల్మ్ మేకర్ బుద్ధదేవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అలానే ఆయనకు కొంతకాలంగా డయాలసిస్ జరుగుతోంది. బుద్ధదేవ్ దాస్ గుప్తా మృతి వార్త తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం తెలిపారు. దర్శకుడిగా సమాజంలోని అన్ని పార్శ్వాలను బుద్ధదేవ్ స్పృశించారని ప్రధాని పేర్కొనగా, ఆయన లేని లోటు చిత్రసీమకు…