Niharika Donates to Budameru Flood Victims: నిర్మాత నిహారిక కొణిదెల సామాజిక బాధ్యత పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి ప్రదర్శించారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి రూ. 9.45 కోట్ల వరకు విరాళాన్ని అందించగా ఇప్పుడు నిహారిక వ్యక్తిగతంగా రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. బుడమేరు నది వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పది గ్రామాలపై నిహారిక దృష్టి కేంద్రీకరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో గ్రామీణ సమాజాలు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లపై ఆమెకున్న అవగాహన…