Vijayawada Crime: విజయవాడలో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ జీవన్ హత్య కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జీవన్ హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి.. పెదపులిపాకకి చెందిన యువతితో జీవన్ కు ప్రేమ వ్యవహారం ఉందని బయటకు పొక్కింది.. నిన్న అర్థరాత్రి జీవన్ పెదపులిపాక వెళ్ళటానికి కారణం యువతేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. యువతి నివసించే ప్రాంతం సమీపంలోనే జీవన్ మృతదేహం లభ్యం కావడంతో ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించారు…