బ్రూస్ విల్లీస్ – ఈ పేరు వింటే డై హార్డ్ సిరీస్ మన మదిలో మెదలుతాయి. 1980ల చివరలో రూపొందిన డై హార్డ్ ఫ్రాంచైజ్ లో హీరోగా నటించిన బ్రూస్ విల్లీస్ నిజజీవితంలోనూ అదే రీతిన ప్రవర్తించారు. తన కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచడానికి డై హార్డ్గానే వ్యవహరించారు. అలాంటి విల్లీస్ 67 ఏళ్ళ వయసులో అఫేసియా వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాది ప్రభావం వల్ల మెదడులోని కణాలు నెమ్మదిగా దెబ్బతింటాయి. తత్ఫలితంగా వినికిడి శక్తి లోపిస్తుంది. ఉచ్చరణ…