టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్ అవుతుందని అన్నారు. పైసలకు అమ్ముడు పోయే వ్యక్తి రేవంత్ రెడ్డి అని... మొదటి నుండి ఆయన గుణం అదేనని తెలిపారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య విరుచుకుపడ్డారు. తనని దసరా బుల్లోడు సంక్రాంతి గంగిరెద్దుగా అభివర్ణించడంతో పరుష పదజాలంతో ప్రశ్నించారు. రేగా కాంతారావు నువ్వు గెలిచింది ఎక్కడా.. కాంగ్రెస్ పార్టీలో గెలిచి డబ్బులకి అమ్ముడుపోయిన నువ్వా నన్ను విమర్శించేదంటూ మండిపడ్డారు. నీకు సిగ్గు లజ్జ ఉంటే ప్రజాక్షేత్రంలో పోరాడాలని అన్నారు.
చిక్కడపల్లిలో నిన్న ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ప్రవళిక సూసైడ్ చేసుకోవడం దారుణమన్నారు. ప్రవళిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నాయని.., మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారని వాళ్ళ అమ్మ నాన్న తో ఫోన్ లో బాధపడిందని అన్నారు. ఆమె మృతికి నిరసనగా యువత మొత్తం వచ్చారని బండి సంజయ్ తెలిపారు. లక్ష్మణ్, భానుప్రకాష్ వాస్తవాలను…
మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనవరి ఒకటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయని తెలిపారు. రైతు రాజ్యాన్ని తెలంగాణలో తీసుకొస్తాం... కేసీఆర్ లాగా ఎకరానికి కోటి రూపాయలు వస్తున్నాయని మభ్య పెట్టమన్నారు.
తెలంగాణ ప్రాంతం అనేక ఉగ్రవాదాల పీడిత ప్రాంతమని మురళీధర్ రావు అన్నారు. కేసీఆర్ ప్రకటించిన విధంగా బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని తెలిపారు. అయితే బీఆర్ఎస్ ఇజ్రాయెల్, ఉగ్రవాదం పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
పెండింగ్ అభ్యర్థుల 5 స్థానాలను మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ చిట్ చాట్‌లో తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన తమ అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారని.. ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులు లేరని.. కానీ 70 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. అది చూసి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు తన రాజకీయ పునాది అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మూసిన చక్కర ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత బీజేపీదేనన్నారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తాళలు తెరిపిస్తానని.. ఈ ప్రాంత రైతులకు మళ్ళీ పూర్వ వైభవం తెస్తానని తెలిపారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయ సంకల్ప పాదయాత్రలో టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, big news, ponguleti srinivas reddy, brs,