తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల ప్రక్రియకు తెర లేచింది. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేలోపే అందుకు సంబంధిచిన షెడ్యూల్ విడుదలైపోయింది. ఈనెల 20న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. పదో తేదీ నామినేషన్ దాఖలుకు ఆఖరు. ఈ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది.