పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం కోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ జరపనున్నారు. నిన్న 5 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ స్పష్టం…