Off The Record: అసలే ఓడిపోయిన బాధలో ఉన్న ఆ పార్టీకి పంచ్‌ల మీద పంచ్‌లు పడుతున్నాయా? ఎద్దు పుండును కాకి పొడిచినట్టుగా సలుపుతోందా? బీఆర్‌ఎస్ టార్గెట్‌గా కవిత చేస్తున్న తాజా కామెంట్స్‌ని ఎలా చూడాలి?
కేసీఆర్ కుటుంబంలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని, ఇక నుంచి ఆ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చంటూ కొద్ది రోజులుగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ఒకరు, శాసనసభాపక్షం చీలిపోతుందని మరొకరు మాట్లాడుతున్నారు. దీంతో... బీఆర్‌ఎస్ కేడర్‌లో ఏదో తెలీని ఆందోళన, అంతకు మించిన గందరగోళం. అదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ సైతం నడుస్తోంది.
మైడియర్ డాడీ అంటూ రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసీఆర్ దేవుడని.. కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని వెల్లడించారు. తనకు పార్టీ, కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకులు సంబర పడొద్దని.. వాళ్లకు కోతికి కొబ్బరి చిప్పదొరికినట్లైందన్నారు.