హనుమకొండలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో సంవత్సరంలో హైదరాబాద్‌కు పోటీగా హనుమకొండ ఉండబోతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని.. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌లకే దక్కుతుందన్నారు.